Virat Kohli Drops An Adorable Comment On Anushka Sharma's Latest Post || Filmibeat Telugu

2019-08-19 3,314

Anushka Sharma’s sun-kissed pic from West Indies has Virat Kohli gushing with love.Anushka Sharma is currently in West Indies with her husband,cricketer Virat Kohli, who is leading the Indian cricket team in a series against West Indies.
#anushkasharma
#viratkohli
#virushka
#teamindia
#indiavswestindies
#indvswi
#miami
#Antigua

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా, వ్యక్తిగత జీవితంకు సంబంధించి ఏదైనా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. దీంతో అనుష్క సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.విరాట్ కోహ్లీతో వివాహం అనంతరం అనుష్క సినిమాలు తక్కువగా చేస్తూ.. భర్తతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతోంది. కోహ్లీ ఏ పర్యటనకు వెళ్లినా అనుష్క కూడా అక్కడ దర్శమిస్తోంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనకు కూడా వెళ్ళింది అనుష్క. ప్రస్తుతం ఈ భామ కరేబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. వివాహం అనంతరం అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉన్న అనుష్క... తాజాగా ఆంటిగ్వా బీచ్‌లో బికినీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలలో పోస్ట్ చేసింది. 'సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.